22ఏ నిషేధిత భూముల నుంచి పట్టా భూములను తొలగించాలి: మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్,అర్జున్ సమాచారం: రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తూ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. భూ బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ. ప్రభుత్వ, అసైన్డ్,...