22A భూముల వ్యవహారంలో ఏ-1 రేవంత్ రెడ్డి, ఏ-2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కమీషన్ల కోసమే సామాన్యుల ఆస్తులు నిషేధిత జాబితాలోకి. తప్పు చేసింది ప్రభుత్వం.. దరఖాస్తుల పేరుతో కార్యాలయాల చుట్టూ జనం ఎందుకు తిరగాలి? సీఎం తమ్ముడికి కోట్ల విలువైన భూములు.. ప్రజల ఆస్తులేమో నిషేధిత జాబితాలో పెడతారా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.. ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కరువైంది . 22 ఏ నిషేధిత జాబితా అక్రమాలపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, శ్వేతపత్రం విడుదల చేయాలి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలి. బాధితుల పక్షాన సెప్టెంబర్ 7న అసెంబ్లీ దద్దరిల్లేలా ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
అర్జున్ సమాచారం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ ఎం.జే. గార్డెన్స్‌లో 22A నిషేధిత భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు. బాధితుల ఆవేదనను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన.. బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, గోరేటి వెంకన్న, సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల...