ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 8:12 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

24 న తహసిల్ కార్యాలయం ప్రారంభోత్సవం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చే ప్రారంభోత్సవం

కమాన్ పూర్ ఆగస్టు 21,అర్జున్ సమాచారం:
కమాన్ పూర్ మండల ప్రజల కలల సాకారం 24న తీరనుంది. ఈనెల 24న 75 లక్షల వ్యయంతో నిర్మించిన కమాన్ పూర్ నూతన తహసిల్దార్ కార్యాలయం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు. దీంతోపాటు శ్రీ ఆది వరహస్వామి కి వెళ్లే 90 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రహదారికి సైతం ప్రారంభోత్సవం చేయనున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు ఈనెల 23న హైదరాబాద్ కు చేరుకొని 24న ఈ ప్రారంభోత్సవాలతో పాటు మండల కేంద్రంలోని ఈ ఆదివారహస్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్లు అధికారులు ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారు.
ఎట్టకేలకు మండల వ్యవస్థ ప్రారంభం నుండి తహసిల్ కార్యాలయం లేక అధ్య భవనాల్లో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తహసిల్ కార్యాలయం ప్రారంభోత్సవం అయితే నూతన శోభ సంతరించుకోనుంది.