24 న తహసిల్ కార్యాలయం ప్రారంభోత్సవం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చే ప్రారంభోత్సవం
కమాన్ పూర్ ఆగస్టు 21,అర్జున్ సమాచారం: కమాన్ పూర్ మండల ప్రజల కలల సాకారం 24న తీరనుంది. ఈనెల 24న 75 లక్షల వ్యయంతో నిర్మించిన కమాన్ పూర్ నూతన తహసిల్దార్ కార్యాలయం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు. దీంతోపాటు శ్రీ ఆది వరహస్వామి కి వెళ్లే 90 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రహదారికి సైతం ప్రారంభోత్సవం చేయనున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు ఈనెల 23న హైదరాబాద్...