30 నెలల్లో 1 లక్ష 70 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగంపై ఖర్చు రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే మా ఆశయమని రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్

ఖమ్మం,అర్జున్ సమాచారం: రాష్ట్రంలోని రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదమని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  అన్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆశీర్వాద సభా వేదికగా అశేషంగా తరలివచ్చిన రైతాంగాన్ని ఉద్దేశించి చెప్పారు. శుక్రవారం చింకాని మండలం జగన్నాధపురం లో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. వానాకాలం సీజ్ రైతు భరోసా తుది విడత నిధులు విడుదల చేసారు. భూములకు సంభంధించి ఈ పట్టాదార్ పాస్ బుక్స్ జారీ చేసారు. ముఖ్యమంత్రి  మాట్లాడుతూ...