నగదు బదిలీ పథకాలకు 4 లక్షల కోట్లా,
విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 20.
నగదు బదిలీ పథకాలపై 2026-27లో రాష్ట్రాలు రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతంతో సమానం. 2022-23లో ఇది 0.6 శాతంగా ఉంది. అదే సమయంలో రాయితీలపై కూడా రాష్ట్రాలు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో రాయితీలు పెరిగాయి. 2018-19లో రాష్ట్రాల రెవెన్యూ వసూళ్లలో 16% రాయితీలపై ఖర్చు చేసేవారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఇది 21 శాతానికి చేరింది’ అని ‘పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్’ వెల్లడించింది. 2026-27కు సంబంధించి రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఆ సంస్థ వెల్లడించిన నివేదికలో ఈ విషయాలు ఉన్నాయి. అందులోని ముఖ్యాంశాలు ఇవి.. 2022-23లో ఆంధ్రప్రదేశ్ తన మొత్తం రెవెన్యూలో 20% నగదు బదిలీ పథకాలకే వెచ్చించింది. ఈ విషయంలో ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ముందున్నాయి. సబ్సిడీలు, నగదు బదిలీ పథకాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు ముందున్నాయి. నగదు బదిలీ పథకాలను మహిళలు, రైతులు, యువత, దివ్యాంగులకు అమలు చేస్తున్నారు. సామాజిక భద్రత పెన్షన్ల రూపంలోనూ చెల్లిస్తున్నారు. పీఎం కిసాన్ నిధులతో పాటు రైతులకు అదనంగా నిధులు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. నగదు బదిలీ పథకాలకు ఈ నివేదికలో చెప్పిన మొత్తం కన్నా ఇంకా ఎక్కువే ఖర్చు చేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాలు నగదు బదిలీ పథకాలపై 2026-27లో రెవెన్యూ రాబడిలో 10 శాతానికి మించి ఖర్చు చేయనున్నాయి. దేశంలో 14 రాష్ట్రాలు నగదు బదిలీ పథకంపై ఖర్చు చేస్తున్న మొత్తంలో నాలుగింట మూడొంతులు సామాజిక భద్రత పెన్షన్లకే వెచ్చిస్తున్నాయిఈ ఆర్థిక ఏడాదిలో నగదు బదిలీ పథకాల కోసం రెవెన్యూ వ్యయంలో అత్యధిక వాటా కేటాయించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో నిలిచాయి. తెలంగాణ రెండో స్థానంలో, ఏపీ నాలుగో స్థానంలో ఉంది. రైతులు, పింఛనుదారుల కోసం కలిపి తెలంగాణ ప్రభుత్వం రూ.32,629 కోట్లు కేటాయించగా.. ఏపీ రూ.33,943 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు ఈ తరహా పథకాల కోసం సుమారు రూ.4 లక్షల కోట్లు కేటాయించాయి. అయితే నగదు బదిలీలపై పెరుగుతున్న వ్యయం ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిపై భారంగా మారుతోందని 16వ ఆర్థిక సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.సంక్షేమ పథకాల కింద ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేసే విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే టాప్‌లో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలు తమ రెవెన్యూ వ్యయంలో నగదు బదిలీ పథకాల కోసం కేటాయించిన నిధుల వాటా ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 15 శాతం కేటాయింపులతో జార్ఖండ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా.. 14 శాతంతో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక 13 శాతం కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది.2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన 128 నగదు బదిలీ పథకాల కోసం రూ.32,629 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో 14 శాతానికి సమానం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే తరహా పథకాల కోసం రూ.33,943 కోట్లు కేటాయించింది. ఇది ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో 13 శాతంగా ఉంది. తెలంగాణ కేటాయింపుల్లో రైతుల కోసం రూ.18 వేల కోట్లు.. సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ.14,629 కోట్లు ఉన్నాయి. ఏపీలో సామాజిక భద్రతా పింఛన్లకు రూ.27,343 కోట్లు.. రైతులకు ఆర్థిక సాయం అందించే పథకాల కోసం రూ.6,600 కోట్లు కేటాయించారు.నగదు బదిలీ పథకాల కోసం అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రూ.47,542 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత కర్ణాటక రూ.40,392 కోట్లు, మహారాష్ట్ర రూ.38,549 కోట్లతో ఉన్నాయి. మధ్యప్రదేశ్ రూ.32,059 కోట్లు, తమిళనాడు రూ.19,036 కోట్లు కేటాయించాయి. రెవెన్యూ వ్యయంలో నగదు బదిలీ పథకాలకు కేటాయించిన వాటా రాష్ట్రాలవారీగా చూస్తే.. జార్ఖండ్ 15 శాతం, తెలంగాణ 14 శాతం, పశ్చిమ బెంగాల్ 14 శాతం, ఆంధ్రప్రదేశ్ 13 శాతం, కర్ణాటక 12 శాతం, మధ్యప్రదేశ్ 10 శాతం, మహారాష్ట్ర 6 శాతంగా ఉన్నాయి.ఈ నగదు బదిలీ పథకాల పరిధిలో మహిళలు, రైతులు, యువతతోపాటు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందించే సామాజిక భద్రతా పింఛన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ తరహా పథకాల కోసం రాష్ట్రాలు కలిపి సుమారు రూ.4 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం. ఇది దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు ఒక శాతానికి సమానం. 2022-23లో ఈ పథకాల కేటాయింపులు జీడీపీలో 0.6 శాతంగా ఉండగా.. 2026-27 నాటికి ఒక శాతానికి చేరడం గమనార్హం.మొత్తం కేటాయింపుల్లో దాదాపు 90 శాతం మహిళలకు అందించే ఆర్థిక సాయం, సామాజిక భద్రతా పింఛన్లకే వెళ్తున్నాయి. మహిళలకు ఇచ్చే సాయంలో ఎక్కువ భాగం నెలవారీగా చెల్లించేలా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారు. రైతులకు ఇచ్చే సాయం, ఇతర పథకాల మొత్తాలను మాత్రం ఏడాదిలో రెండు లేదా మూడు విడతలుగా అందించే విధానాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు, నగదు బదిలీలపై చేస్తున్న ఖర్చు క్రమంగా పెరుగుతోందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ భాగాన్ని మినహాయించి చూస్తే.. 2018-19లో రాష్ట్రాల రెవెన్యూ రాబడుల్లో సబ్సిడీలు, నగదు బదిలీల వాటా 16 శాతంగా ఉండేది. 2023-24 నాటికి అది 21 శాతానికి పెరిగింది.ఈ కాలంలో నగదు బదిలీల వ్యయం ఏటా సగటున 24 శాతం వృద్ధి చెందింది. ఇదే సమయంలో సబ్సిడీల ఖర్చు వృద్ధి 12 శాతంగా నమోదైంది. అంటే సబ్సిడీలతో పోలిస్తే నగదు బదిలీలపై ప్రభుత్వాల వ్యయం రెండింతల వేగంతో పెరిగిందని నివేదిక విశ్లేషించింది. నగదు బదిలీ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం అందుతున్నప్పటికీ.. వాటి అమలులో కొన్ని సమస్యలు ఉన్నాయని 16వ ఆర్థిక సంఘం అభిప్రాయపడింది. ఈ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉండటం, అర్హత ప్రమాణాలు విస్తృతంగా ఉండటంతో లక్ష్యిత వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేరేలా చేయడం కష్టమవుతోందని పేర్కొంది.దీంతో ప్రభుత్వాలపై గణనీయమైన ఆర్థిక భారం పడుతోందని.. అనర్హులకూ ప్రయోజనాలు అందే అవకాశం ఉందని 16వ ఆర్థిక సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. అందువల్ల లబ్ధిదారుల జాబితాలను హేతుబద్ధీకరించి.. నిజంగా అర్హులైన వారికే పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ నివేదికలో 128 నగదు బదిలీ పథకాలను మాత్రమే గుర్తించి విశ్లేషించారు. దేశవ్యాప్తంగా అమలు అవుతున్న పథకాలన్నింటినీ ఇది పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదని కూడా స్పష్టం చేసింది. అందువల్ల వాస్తవంగా రాష్ట్రాలు నగదు బదిలీ పథకాలపై చేస్తున్న ఖర్చు నివేదికలో పేర్కొన్న మొత్తాల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.