* 44ఎర్రచందనం కేసుల్లోని మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్ అతనితో పాటు మరో స్మగ్లర్ అరెస్టు 7 ఎర్రచందనం దుంగలు, ఒక కారు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం
అర్జున్ సమాచారం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో, శేషాచల అడవులలో ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆపరేషన్ లు నిర్వహించడం తో పాటు, ఎర్ర చందనం కేసు లలో ముద్దాయిలు గా ఉంటూ తప్పించుకొని తిరుగుతున్న అంతర రాష్ట్ర స్మగ్లర్లను చట్టం ముందు నిలబెట్టడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ బృందం, స్టేట్ ఇంటేలిజెన్స్ బృందం కు మరియు అటవీ సిబ్బంది కి...