53 325 పాయింట్లు పడిన సెన్సెక్స్
ముంబై, ఆగస్టు 19,అర్జున్ సమాచారం: దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగింది. గ్లోబల్ మార్కెట్లలో బలహీన పరిస్థితుల ప్రభావంతో బుధవారం బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ వరుసగా ఏడో సెషన్‌లో పతనమైంది. సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజు నష్టపోయింది.బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 76.60 పాయింట్లు నష్టపోయి 24,078.30 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 325.78 పాయింట్లు తగ్గి 76,909.68 వద్ద ముగిసింది. సెప్టెంబరు 2025 తర్వాత నిఫ్టీకి ఇదే అత్యంత సుదీర్ఘ నష్టాల పరంపర.నిఫ్టీ ప్రస్తుతం కీలకమైన 24,000 స్థాయికి...