సిద్దిపేట,అర్జున్ సమాచారం:
ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించడం మన సంస్కృతి, సంప్రదాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదించే వినాయకుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు.వినాయక నవరాత్రుల సందర్భంగా సిద్దిపేట పట్టణం లో 60 గణేష్ మండపాల లో కొలువైన విఘ్నేశ్వరున్ని దర్శించుకున్నారు కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ. యజ్ఞం, హోమం, వ్రతం, పూజతో పాటు ఏ శుభకార్యమైనా వినాయకుడిని పూజిస్తామన్నారు. దేవుడిని ఎంత ఆడంబరంగా పూజించామన్నది ముఖ్యం కాదు..ఎంత భక్తి, శ్రద్ధతో పూజించామన్నదే ముఖ్యమని. బంగారంతో పూజ చేసినా భక్తి లేకపోతే ప్రయోజనం లేదన్నారు. మట్టితో చేసిన వినాయకుడినైన మనస్ఫూర్తిగా పూజిస్తే భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి అని పేర్కొన్నారు. వినాయక ఉత్సవాల్లో మట్టి విగ్రహాలు, సహజ రంగుల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్, రసాయనాలు, హానికరమైన రంగుల వినియోగం వల్ల చెరువులు, నీటి వనరులు, భూగర్భ జలాలు కలుషితమై చివరకు ప్రజల ఆరోగ్యంపైనే ప్రభావం చూపుతాయని తెలిపారు.
=============================