7 వేల మెగావాట్ల ‘ఎల్ నినో’ షాక్‌ను తట్టుకున్న విద్యుత్ వ్యవస్థ రాష్ట్రంలో పవర్ కట్ అనేదే లేదు: హనుమకొండ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్షాకాలంలోనూ వేసవిని తలపించిన 16,500 మెగావాట్ల పీక్ డిమాండ్ 2 వేల మెగావాట్ల జల విద్యుత్ నిలిచినా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా దేశంలోనే తొలిసారిగా ‘ఎలక్ట్రిసిటీ ఆంబ్యులెన్స్’, 1912 హెల్ప్‌లైన్‌కు కృత్రిమ మేధ (AI) అప్పుల రీస్ట్రక్చరింగ్‌తో డిస్కంలను నంబర్-1గా తీర్చిదిద్దే ప్రణాళికలు ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష
హనుమకొండ,అర్జున్ సమాచారం: ‘ఎల్ నినో’ ప్రతికూల వాతావరణ ప్రభావంతో వర్షాకాలంలోనూ వేసవిని తలపించిన విద్యుత్ డిమాండ్, పడిపోయిన జల విద్యుత్ ఉత్పత్తితో ఒకేసారి పడిన *7,000 మెగావాట్ల అదనపు భారాన్ని* తెలంగాణ విద్యుత్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా తట్టుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సాధారణంగా వర్షాకాలంలో 11,000 మెగావాట్లుగా ఉండే పీక్ డిమాండ్ అనూహ్యంగా 16,500 మెగావాట్లకు చేరడం, మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేక 2,000 మెగావాట్ల జల విద్యుత్ (హైడల్ పవర్)...