7, 8, 9 తేదీల్లో కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించడంతో పాటు దాదాపు రూ. 9,100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. పూర్తయిన భవనాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.

నవంబర్ 7వ తేదీ (శనివారం), అర్జున్ సమాచారం: ముఖ్యమంత్రి  ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట చేరుకుని అక్కడ నిర్వహిస్తున్న మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. రైతు మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అక్కడే ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించే ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి కొడంగల్ చేరుకుంటారు. నవంబర్ 8వ తేదీ (ఆదివారం). ఉదయం హకీంపేట చేరుకుని స్వయం సహాయక సంఘాల మహిళలతో జరిగే సమావేశంలో...