8సమస్యల పరిష్కారానికి టిజిఈజేఏసి “మహాధర్నా” -సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం
మంచిర్యాల, ఆగస్టు 27,అర్జున్ సమాచారం: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి, సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని టిజిఈజేఏసి నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టిజిఈజేఏసి) పిలుపుమేరకు గురువారం టీజీఈజేఏసి జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజా రెడ్డి ల ఆధ్వర్యంలో జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత కార్యాలయాల భవన సముదాయం ఎదుట మహా...