అమెరికా, కెనడాల నుంచి లండన్‌కు 86 టన్నుల బంగారాన్ని తరలింపు.

అమెరికా, కెనడాల నుంచి లండన్‌కు 86 టన్నుల బంగారాన్ని తరలింపు ముంబై, సెప్టెంబర్ 3 అర్జున్ సమాచారం ప్రతినిధి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయాన్ని అమలు చేసింది. అమెరికా, కెనడా దేశాల్లో నిల్వ ఉంచిన తమ 86 టన్నుల పసిడి నిల్వలను బ్రిటన్ రాజధాని లండన్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్' వాల్ట్‌కు విజయవంతంగా తరలించినట్లు డచ్ సెంట్రల్ బ్యాంక్ అధికారికంగా ధ్రువీకరించింది. సంక్షోభ సమయంలో ఈ పసిడిని అత్యంత వేగంగా ట్రేడింగ్...