ePaper
Friday, August 21, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్త్రిశక్తి ఆలయంలో ఘనంగా సామూహిక కుంకుమార్చన

త్రిశక్తి ఆలయంలో ఘనంగా సామూహిక కుంకుమార్చన

📰 Generate e-Paper Clip

మెట్ పల్లి,అర్జున్ సమాచారం:
శ్రావనమాస శుక్రవారం రోజున స్థానిక త్రిశక్తి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు నిర్వహించారు. ఈ సందర్బంగా మహాలక్ష్మి, దుర్గామాత, సరస్వతీ త్రిశక్తి అమ్మవార్లకు ఉదయం పంచామృతాలతో అభిషేకం చేసి, విశేషపూజలు నిర్వహించారు. తదనంతరం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని త్రిశక్తి అమ్మవార్లకు కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తదుపరి అర్చకులు భక్తజనులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ధ్యావన పెళ్లి  రాజారాం,ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
=============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!