ePaper
Sunday, August 23, 2026
ePaper
Homeతెలంగాణమానవతను చాటుకున్న గాయత్రి విద్యాసంస్థల విద్యార్థులు

మానవతను చాటుకున్న గాయత్రి విద్యాసంస్థల విద్యార్థులు

📰 Generate e-Paper Clip

మానవతను చాటుకున్న గాయత్రి విద్యాసంస్థల విద్యార్థులు

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 22:

ఇటీవల బసంత్‌నగర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దపల్లి జిల్లా చీకురాయికి చెందిన పింకాశి సతీష్‌ కుటుంబాన్ని గాయత్రి విద్యాసంస్థల చైర్మన్‌ అల్లెంకి శ్రీనివాస్‌ పరామర్శించారు. సతీష్‌ భార్య, కుమారుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాయత్రి విద్యానికేతన్‌, గాయత్రి జూనియర్‌ కళాశాల, గాయత్రి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల విద్యార్థులు సేకరించిన రూ.32 వేల విరాళాన్ని అల్లెంకి శ్రీనివాస్‌ చేతుల మీదుగా సతీష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సతీష్‌ భార్య, కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో గాయత్రి విద్యాసంస్థల కరస్పాండెంట్‌ అల్లెంకి శ్రీనివాస్‌, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!