గణనాథునికి ఘనంగా పూజలు ,ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు వినాయక చవితి పూజ కార్యక్రమాలు
కొమురం భీమ్:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 15.
వినాయకుని ప్రతిమను ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా ఎస్పీ నితికా పంత్
భక్తిశ్రద్ధలతో తొలి పూజలు నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారి.
జిల్లా ప్రజలకు గణపతి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ.
కుమురం భీమ్ ఆసిఫాబాద్
మంగళవార ఉదయం వినాయక చవితి సందర్భంగా స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు భక్తిశ్రద్ధలతో గణనాథునికి ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. తొలి పూజలను జిల్లా ఎస్పీ నితికా పంత్ ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది.స్వయంగా గణపతి ప్రతిమను ప్రతిష్టించి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
జిల్లా ప్రజలందరికీ మొదటగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ పోలీసులు సూచించినటువంటి సూచనలను పాటిస్తూ, గణపతి ప్రతిమలు తరలించే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో,ఆర్ఐ అడ్మిన్ ఎన్. వామనుమూర్తి,ఆర్ఐ ఎంటిఓ అంజన్న,ఆర్ఎస్ఐ లవన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

