ePaper
Thursday, October 8, 2026
ePaper
Homeసినిమాఅనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్

అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్

📰 Generate e-Paper Clip

హ్యాపీ ఆక్స్ ఎంటర్టైన్మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానంభవతి ఆర్ట్స్ బ్యానర్ల మీద సాదత్, ముని శివ నిర్మించిన చిత్రం ‘సరిపోయారు ఇద్దరూ’.  సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఈ మూవీలో మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న, రాజేంద ప్రసాద్, సీనియర్ నటుడు నరేష్, రిధ్ది కుమార్, మేఘా చౌదరి కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. హిట్ మెషీన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసి టీం కు అభినందనలు తెలిపారు.
టీజర్‌లో పల్లెటూరి వాతావరణం, వైజాగ్ సిటీని అందంగా చూపించారు. టీజర్ ప్రారంభంలో స్నేహితులుగా కలిసి ఉన్న నరేష్, రాజేంద్ర ప్రసాద్.. టీజర్ ఎండింగ్‌కి అలా ఎందుకు మారారు? అన్నదే కథ అన్నట్టు కట్ చేశారు. ఇక యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా సినిమాని సతీష్ వేగేశ్న తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథ, ఎమోషన్స్, హాస్యం, ప్రేమ అన్ని రకాల అంశాలున్నాయని టీజర్‌ను గమనిస్తేనే తెలుస్తోంది.
టీజర్‌లో మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న స్క్రీన్ ప్రజెన్స్ బాగున్నాయి. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్.. వైజాగ్ ఎపిసోడ్స్ సినిమాకి కీలకంగా ఉండబోతోన్నాయి. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. సమీర్ రెడ్డి సినిటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
*నటీనటులు* : మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న, రిధ్ది కుమార్, మేఘా చౌదరి, రాజేంద్ర ప్రసాద్, వీకే నరేష్, అన్నపూర్ణమ్మ, రఘు బాబు, సుదర్శన్, ప్రవీణ్, ఆనంద్, రచ్చ రవి, శివన్నారాయణ, అన్షు రెడ్డి, మణిచందన, సిజ్జు, భద్రం, చింటు తదితరులు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!