ePaper
Friday, October 9, 2026
ePaper
Homeతెలంగాణదసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి,రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్,సింగరేణి, మున్సిపల్, పోలీస్...

దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి,రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్,సింగరేణి, మున్సిపల్, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం.

📰 Generate e-Paper Clip

దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి,
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్,సింగరేణి, మున్సిపల్, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం.

గోదావరిఖని: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు.9

గోదావరిఖనిలోని జవహర్‌లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను ఘనంగా, ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సూచించారు.

దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సింగరేణి, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. స్టేడియం పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, విద్యుత్ ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

సింగరేణి, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ దసరా ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు.

ప్రజలు కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొని సంతోషంగా పండుగను జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్  జల్ద అరుణశ్రీ , రామగుండం మేయర్ మహంకాళి స్వామి , ఏసీపీ  రమేష్ , సీఐ ఇంద్రసేన రెడ్డి , సింగరేణి మరియు మున్సిపల్ శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!