గన్నవరం: అర్జున్ సమాచారం:
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం మధ్యాహ్నం 2.45 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్తో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.
రాష్ట్రపతి రెండు రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ తో పాటు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా, 4(ఏ), గర్ల్స్ ఎన్సిసి బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ప్రవీణ్ యాదవ్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జిల్లా ఎస్పీ వి. విద్యా సాగర్ నాయుడు భారత రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు
======================

