నిర్మల్,అర్జున్ సమాచారం:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అర్ధరాత్రి సమయంలో జోగిని సుధాకర్ స్వామిని దారుణంగా హత్య చేసి, అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, వెండి, నగదు మరియు హరియర్ కారును అపహరించి మధ్యప్రదేశ్కు పారిపోతున్న నిందితుడిని నిర్మల్ జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి నిర్మల్ జిల్లా పోలీసులకు సమాచారం అందడంతో, రాత్రి విధుల్లో ఉన్న నిర్మల్ రూరల్ ఎస్ఐ లింబాద్రి, పోలీసు సిబ్బంది శ్రీనివాస్, సూర్యభాను, రఘు, శ్రీధర్లతో కలిసి సోన్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.
పోలీసులను గమనించిన నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 1.4 కిలోల బంగారం, 3 కిలోల వెండి, రూ.9 లక్షల నగదు మరియు హరియర్ కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం యాదాద్రి జిల్లా పోలీసులకు అప్పగించారు. ఈ సాహసోపేతమైన చర్యలో పాల్గొని నిందితుడిని పట్టుకున్న నిర్మల్ రూరల్ ఎస్ఐ లింబాద్రి మరియు పోలీసు సిబ్బందిని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల, అభినందించారు.
హిజ్రా హత్యకేసు నిందితుడు అరెస్టు
RELATED ARTICLES

