ePaper
Sunday, November 8, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరె మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితుల...

వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరె మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్.. మరో నిందితుడి కోసం గాలింపు సంగారెడ్డి జిల్లాలో మూడు దారి దోపిడీ కేసులతో పాటు కర్ణాటకలోని హుమ్నాబాద్‌లో జరిగిన మరో దారి దోపిడీ కేసును ఛేదించిన సంగారెడ్డి పోలీసులు ఎయిర్ పిస్టల్ (నకిలీ తుపాకీ), 2-కత్తులు, నేరాలకు ఉపయోగించిన ద్విచక్రవాహనం, ఇతర వస్తువులు స్వాధీనం నిందితులపై మహారాష్ట్రలో గతంలోనూ పలు దొంగతనాలు, దోపిడీ కేసులు నమోదు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి,అర్జున్ సమాచారం:
జిల్లాలో నమోదైన వరుస దారి దోపిడీ కేసులను ఛేదించేందుకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఆదేశాల మేరకు సీసీఎస్, జహీరాబాద్ సబ్ డివిజన్, సదాశివపేట పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టి, జిల్లాలో నమోదైన మూడు దారి దోపిడీ కేసులతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి NH-65 పై జరిగిన మరో దారి దోపిడీ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన ముగ్గురు కరుడుగట్టిన నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
ముగ్గురు నేరస్తులు నేరం చేయడానికై మహారాష్ట్ర నుంచి యమహా  బ్ల్యూ కలర్ నెంబర్ ప్లేట్ లేని బైక్ పై బయలుదేరి నల్లని మాస్క్, స్వెట్టర్ లు, 2-కత్తులు బ్యాగ్ లో పెట్టుకొని, మరో వ్యక్తి ఎయిర్ పిస్టల్ ను కనబడకుండా దాచి పెట్టుకొని, తెలంగాణ వైపు వస్తుండగా, చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాడ్గి చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని యమహా బ్ల్యూ కలర్ ఆర్ 15 బైక్ పై అనుమానాస్పదంగా కనిపించడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, సంగారెడ్డి జిల్లాలో జరిగిన మూడు దారి దోపిడీ కేసులతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని హుమ్నాబాద్‌లో జరిగిన మరో దారి దోపిడీ కేసులో తమ ప్రమేయాన్ని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!