ePaper
Thursday, November 12, 2026
ePaper
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయంఈజిప్టులో ఘోర రైలు ప్ర‌మాదం.. ఏడుగురుమృతి ....100 మందికి గాయాలు..

ఈజిప్టులో ఘోర రైలు ప్ర‌మాదం.. ఏడుగురుమృతి ….100 మందికి గాయాలు..

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
ఈజిప్టులోని గిజా నగరం సమీపంలో ఘోర రైలు ప్ర‌మాదం చోటు చేసుకుంది. గిజా ప్రావిన్స్‌లో రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఢీకొన్నాయి. అల్‌ అయ్యత్‌ జిల్లా నుంచి ఫయూమ్ వెళ్తున్న ఓ ప్యాసింజర్ రైలు.. కైరో నుంచి అస్వాన్ వెళ్తున్న మరో రైలును వెనక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి  చెందారు. మరో 100 మందికిపైగా గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి అనేక బోగీలు పట్టాలు తప్పి కాలువలోకి జారిపడ్డాయని దేశ రైల్వే అథారిటీ తెలిపింది. అత్యవసర బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. ప్రమాద ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరపాలని ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అధికారుల‌ను ఆదేశించారు. కాగా, ఇదే జిల్లాలో గతేడాది రెండు గూడ్స్‌ రైళ్లు ఢీకొన్న ఘటనలో లోకోపైలట్‌, ఆయన అసిస్టెంట్‌కు గాయాలయ్యాయి. మ‌రోవైపు ఈ ఘోర రైలు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆదివారం ఈజిప్ట్‌లో డిమాండ్లు వెల్లువెత్తాయి.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!