రెండేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ.. న్యాయం కోసం యువతి నిరాహార దీక్ష,
మంచిర్యాల: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 20.
బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామానికి చెందిన ఎల్లమధ్రి అనిత (24), తండ్రి ప్రకాష్, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన యువతి. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన పాల్తే గౌతమ్ (27), తండ్రి మోహన్, లంబాడీ సామాజిక వర్గానికి చెందిన యువకుడితో గత రెండు సంవత్సరాలుగా పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని యువతి తెలిపింది.
ఇద్దరూ ప్రేమించుకున్నారని, అయితే ప్రస్తుతం తనను వివాహం చేసుకోవడానికి గౌతమ్ నిరాకరిస్తున్నాడని అనిత ఆరోపిస్తోంది. రెండేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వివాహానికి నిరాకరించడంతో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలోని పాల్తే గౌతమ్ ఇంటి ముందు అనిత నిరాహార దీక్ష చేపట్టింది.
తాను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన యువతినని, యువకుడు లంబాడీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని పేర్కొంటూ, కులాలతో సంబంధం లేకుండా తనకు న్యాయం జరగాలని అనిత కోరుతోంది.
సంబంధిత అధికారులు, పోలీసు శాఖ స్పందించి ఇరువర్గాల వాదనలు విని సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.

