ePaper
Saturday, November 21, 2026
ePaper
Homeసినిమామాతృభూమి' మూవీ ప్రమోషన్స్‌లో హైదరాబాద్‌కు సల్మాన్ ఖాన్

మాతృభూమి’ మూవీ ప్రమోషన్స్‌లో హైదరాబాద్‌కు సల్మాన్ ఖాన్

📰 Generate e-Paper Clip

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ కాంబోలో రానున్న నూతన చిత్రం ‘మాతృభూమి : మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ . ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. రీసెంట్‌గా
విడుదల చేసిన ట్రైలర్‌కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 9 రోజుల్లోనే ట్రైలర్ 9 కోట్ల వీక్షణలు దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్‌కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో సల్మాన్ ఖాన్, చిత్రాంగద
హైదరాబాద్‌కి వచ్చి ఇక్కడి మీడియాతో తమ సక్సెస్‌ను పంచుకున్నారు.
‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ మొదటి టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసే క్రమంలో ప్రమోషన్స్ అంటూ సల్మాన్
ఖాన్, చిత్రాంగద సింగ్ హైదరాబాద్‌కి విచ్చేశారు. ఈ వార్-డ్రామా ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక విలేకరుల సమావేశానికి హాజరయ్యారు. వీరిద్దరూ స్థానిక మీడియాతో సినిమా
గురించి మాట్లాడటంతో ఈ కార్యక్రమంలో భారీ సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, చిత్రాంగద తమ తమ పాత్రల గురించి, కథకు ప్రాణం పోయడానికి మానసిక శ్రమ గురించి చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో తాము ఎదుర్కొన్న సవాళ్ల గురించి
సుదీర్ఘంగా మాట్లాడారు. ఇప్పటివరకు సినిమాకు వచ్చిన అద్భుతమైన స్పందన గురించి మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేవలం 9 రోజుల్లోనే 9 కోట్ల వీక్షణలు దాటి ఇంటర్నెట్‌ను కుదిపేసిన
ట్రైలర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అలాగే ఇప్పటికే శ్రోతల అభిమానాన్ని అందుకున్న హిట్ సౌండ్‌ట్రాక్ గురించి కూడా వారు చర్చించారు.
హైదరాబాద్‌లో సల్మాన్ సినిమాలపై ఉన్న క్రేజ్ గురించి, స్థానిక ప్రేక్షకులు ఆయన చిత్రాలను ఎప్పుడూ ఒక పండుగలా ఎలా జరుపుకుంటారో వారు మాట్లాడారు. సల్మాన్, చిత్రాంగద మీడియాతో
ఆప్యాయంగా మమేకమై, ఈ సమావేశాన్ని ఉల్లాసంగా, సరదాగా మార్చారు. రోజురోజుకూ బజ్ మరింత బలపడుతుండటంతో ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా
ఎదురుచూస్తున్న థియేట్రికల్ అనుభవాలలో ఒకటిగా మారింది.
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ చిత్రంలో సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ కీలక పాత్రల్లో నటించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!