ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్హాలహర్వి ఎంపీపీఎస్ స్కూల్లో రెగ్యులర్ టీచర్లు నియమించాలి 160 మంది విద్యార్థులకు...

హాలహర్వి ఎంపీపీఎస్ స్కూల్లో రెగ్యులర్ టీచర్లు నియమించాలి 160 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు ఎలా బోధిస్తారు విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్న విద్యాశాఖ అధికారులు విద్యార్థి సంఘాలు

📰 Generate e-Paper Clip

ఎమ్మిగనూరు , అర్జున్ సమాచారం :
నందవరం మండలం హాలహర్వి గ్రామంలో ఎంపీపీఎస్ స్కూలు ముందు ఆర్ ఏ వి ఎఫ్, పి ఆర్ ఎస్ వై ఎఫ్, పి ఎస్ యు విద్యార్థి సంఘాలు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు కృష్ణ రఘునాథ్ ఖాజా  సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా జిల్లాకు 2700 పోస్టులు ఇచ్చామని గొప్పలు చెప్పడం తప్ప జిల్లా మారుమూల గ్రామాలలో చాలా స్కూళ్లలో టీచర్ల కొరతమాత్రం అలాగే ఉందని వారు అన్నారు ముఖ్యంగా హాలహర్వి గ్రామంలో 160 మంది విద్యార్థులకు కేవలం ఒక్క రెగ్యులర్ ఉపాధ్యాయుడే ఉండటం దుర్మార్గమని వారు అన్నారు అధికారులు తూతూమంత్రంగా ఇద్దరూ ఉపాధ్యాయులను డిప్యూటేషన్ వేసి చేతులు దులుపుకోవడం సరైన చర్య కాదని వారు అన్నారు హాలహర్వి గ్రామంలో ఉపాధ్యాయుల కొరత వలన విద్యార్థులు టీసీలు తీసుకొని ప్రైవేట్ స్కూల్లో కి వెళ్లే పరిస్థితి నెలకొని ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు  ఇకనైనా అధికారులు నాయకులు స్పందించి విద్యా హక్కు చట్టం ప్రకారం 1:30 రేషియో ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని అలాగే అసంపూర్తిగా ఉన్న తరగతి గదులను పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించకపోతే  విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!