హుస్నాబాద్,అర్జున్ సమాచారం:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో అక్కన్నపేట మండలం లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి
ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. . ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శివయ్య, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతు సంపత్ ను అభినందించి సత్కరించిన మంత్రులు
మంత్రి పొన్నం ప్రభాకర్.
జనగామ లో ఆయిల్ ఫామ్ సాగు కోసం మొక్కలు నాటినందున మీకు అభినందనలు
తన 8 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుతున్న రైతు సంపత్ కి అభినందనలు.
ఆయిల్ ఫామ్ సాగు పెంచడానికి 5 ఎకరాల పైన ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశాం
ఆయిల్ ఫామ్ డిమాండ్ కి తగ్గ ఉత్పత్తి లేదు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలి.
మనకు కూత వేటు దూరంలో నర్మేట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి విజ్ఞప్తి అన్ని గ్రామాల సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు అధికారులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలి
జిల్లాలో 50 వేల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పుడు 14 వేల ఎకరాలకు పైగా సాగు జరుగుతుంది.
ఒక్కో చిన్న గ్రామంలో 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు దాటిస్తే 5 లక్షలు,పెద్ద గ్రామాల్లో 200 ఎకరాల పైన సాగు ప్రోత్సహిస్తే 10 లక్షల అభివృద్ధి ప్రోత్సాహకాలు అందిస్తాం.
ఎల్ నినో రాబోతుంది తీవ్ర కరువు కాటకాలు వర్షాభావ పరిస్థితులు ఉంటాయి రైతులు ఆరుతడి పంటలు వేసుకోవచ్చు.
5 ఎకరాలు ఉన్న రైతు 3 ఎకరాలు,10 ఎకరాలు ఉన్న రైతు 7 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలి
దీని ద్వారా కోతుల బెడద ఉండదు.
==========================
