హిమాయత్ నగర్ లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ
హైదరాబాద్. (అర్జున్ సమాచారం ప్రతినిధి) జూలై 24.
ఢిల్లీలో రాహుల్ గాంధీ పై దాడిని, విద్యార్థులపై లాఠీ చార్జీని, అరెస్టులను ఖండిస్తూ… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హిమాయత్ నగర్ కూడలి నుంచి హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. హిమాయత్ నగర్ వై జంక్షన్ నుండి హైదర్ గూడ చౌరస్తా వరకు శాంతియుత ర్యాలీ చేపట్టారు. నీట్ పేపర్ లికేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం అడుతుందని ఆరోపించారు. ప్రశ్న పత్రాలను కాపాడలేని నాయకులు , దేశాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యార్థుల డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని ధర్మేందర్ ప్రధన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ధర్మేందర్ ప్రధన్ దిష్టిబొమ్మను దహనం చేసారు. పొలీసులు నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది.

