రంపచోడవరం,అర్జున్ సమాచారం:
రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్టీచర్ సమావేశం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
విద్యార్థులు తీసుకుంటున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి, ఆహారం నాణ్యత, పరిశుభ్రత, వడ్డింపు విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై వారితో కలిసి భోజనం చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై విశ్వాసాన్ని చాటారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పాఠశాలల్లో విద్యతో పాటు పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది.ఈ దృశ్యం అక్కడున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆకట్టుకోగా, ముఖ్యమంత్రి, మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
==============================
రంపచోడవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో సహపంక్తి భోజనం
RELATED ARTICLES

