జన్మదిన వేడుకలతో పాటు ఉత్తమ అధికారులకు ఘన సన్మానం..
అర్జున్ సమాచారం.జులై 15. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల, ఆగస్టు 15: టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీ శ్రీపతి బాపురావు, మాజీ జిల్లా కార్యదర్శి శ్రీ భూముల రామ్మోహన్ జన్మదినోత్సవ వేడుకలు శనివారం టీఎన్జీవో భవన్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారి పురస్కారం పొందిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కూర్మచలం శ్రీనివాస్, నాయబ్ తహసీల్దార్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ బి. రాజేందర్‌లను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం టీఎన్జీవో సంఘం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి ఉత్తమ అధికారులుగా పురస్కారాలు అందుకున్న ఉద్యోగులను సన్మానించడం ద్వారా ఇతర ఉద్యోగుల్లో స్ఫూర్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీ బొడ్డు శ్రావణ్‌కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీ పొన్న మల్లయ్య, కోశాధికారి శ్రీ సతీష్‌కుమార్, ఉపాధ్యక్షులు తిరుపతి, రామ్‌కుమార్, అంజయ్య, సత్యనారాయణ, నరేందర్, కేజియా రాణి, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, కార్యనిర్వాహక కార్యదర్శి మోసిన్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షులు ప్రకాష్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.