విలేఖరి కలం ప్రజల విశ్వాసానికి ప్రతీక కావాలి! సమాజానికి అర్జున్ సమాచారం దినపత్రిక సంపాదకుడు లింగం రాజయ్య సందేశం.
అర్జున్ సమాచారం,జులై 04,మంచిర్యాల ప్రతినిధి: ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా విలేఖరి పాత్ర అత్యంత బాధ్యతాయుతమైనది. విలేఖరి రాసే ప్రతి వార్త సమాజంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల నిజాయితీ, నిష్పాక్షికత, వాస్తవాల నిర్ధారణ, ప్రజా ప్రయోజనం అనే నాలుగు సూత్రాలను ఎప్పుడూ విడిచిపెట్టకూడదని అర్జున్ సమాచారం దినపత్రిక సంపాదకుడు లింగం రాజయ్య పేర్కొన్నారు. విలేఖరి ఏ వ్యక్తికీ అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ వ్యవహరించకుండా వాస్తవాలను మాత్రమే ప్రజల ముందుకు తీసుకురావాలి. విన్న మాటను వార్తగా ప్రచురించడం కాదు, ప్రతి సమాచారాన్ని ఆధారాలతో నిర్ధారించి ప్రజలకు...