ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 2:46 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆదివాసీ నాయకపోడ్ హక్కుల కోసం ఈ నెల 24న ఉట్నూర్ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ముట్టడి.జైపూర్ మండల ఆదివాసీ నాయకపోడ్ ప్రజలు భారీగా తరలిరావాలి.మండల అధ్యక్షుడు బిస్కుల రవి పిలుపు.

ఆదివాసీ నాయకపోడ్ హక్కుల కోసం ఈ నెల 24న ఉట్నూర్ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ముట్టడి.జైపూర్ మండల ఆదివాసీ నాయకపోడ్ ప్రజలు భారీగా తరలిరావాలి.మండల అధ్యక్షుడు బిస్కుల రవి పిలుపు.

అర్జున్ సమాచారం. ఆగస్టు 22. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

జైపూర్: ఆదివాసీ నాయకపోడ్‌ల హక్కుల పరిరక్షణ, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న ఉట్నూర్‌లోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ జైపూర్ మండల అధ్యక్షుడు బిస్కుల రవి తెలిపారు.
ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ గంజి రాజన్న పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆదివాసీ నాయకపోడ్‌లకు సంబంధించిన హక్కులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉట్నూర్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ నాయకపోడ్‌ల హక్కులను ప్రభుత్వం గుర్తించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జైపూర్ మండలానికి చెందిన ఆదివాసీ నాయకపోడ్ సోదరులు, కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉట్నూర్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పాత శివకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు పెద్దల తిరుపతి, ప్రచార కార్యదర్శి పళ్ల రాజు కుమార్, కులస్థులు మనుబోతుల రాజు కుమార్, కూన శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.