ఒక్క చుక్క రక్తం.. ఒక ప్రాణానికి జీవనాధారం.రక్తదానంపై అవగాహన కల్పిస్తూ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.

ఒక్క చుక్క రక్తం.. ఒక ప్రాణానికి జీవనాధారం.రక్తదానంపై అవగాహన కల్పిస్తూ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ. అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 19. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాలజిల్లా:ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాల్లో భాగంగా శనివారం రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమని...