ట్రాక్టర్ యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం,
నవంబర్ 27న ట్రాక్టర్ యజమానుల సేవా సమితి సమావేశం.. ప్రతి సభ్యుడు హాజరుకావాలని పిలుపు…
మంచిర్యాల:అర్జున్ సమాచారం .నవంబర్ 21 .డెస్క్.
మంచిర్యాల పట్టణంలోని ట్రాక్టర్ యజమానుల సమస్యల పరిష్కారంతో పాటు, అసోసియేషన్ నియమ నిబంధనలు, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంచిర్యాల ట్రాక్టర్ యజమానుల సేవా సమితి ప్రతినిధులు తెలిపారు.
ఈ మేరకు ట్రాక్టర్ యజమానుల సేవా సమితి ,
ముఖ్య సభ్యులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ట్రాక్టర్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే అసోసియేషన్ నియమ నిబంధనలు, సభ్యుల బాధ్యతలు, సమితికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశానికి ఇసుక రవాణా వాహనాల యజమానులు, ట్రాక్టర్ యజమానుల సేవా సమితిలో సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. ఇది ప్రతి సభ్యుడి బాధ్యతగా భావించి సమావేశానికి సమయానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు మంచిర్యాలలోని హైటెక్ సిటీ క్లబ్‌హౌస్ పక్కన సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమితి అభివృద్ధికి, ట్రాక్టర్ యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలియజేసి సమావేశాన్ని విజయవంతం చేయాలని మంచిర్యాల ట్రాక్టర్ యజమానుల సేవా సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు.