జన్నారంలో కన్నులపండువగా ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ.ముక్తకంఠంతో మార్మోగిన ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు.
జన్నారంలో కన్నులపండువగా ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ.ముక్తకంఠంతో మార్మోగిన ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు. జన్నారం ప్రతినిది: ( అర్జున్ సమాచార్) ఆగస్టు 12. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, దేశభక్తి భావనను చాటిచెప్పేలా జన్నారం మండల కేంద్రంలో ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు, బీజేపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు.స్థానిక ధర్మారం చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ తెలంగాణ తల్లి విగ్రహం...