మహిళా సాధికారత దిశగా ముందడుగు రాజాపూర్‌లో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ ధ్రువపత్రాల పంపిణీ
మహిళా సాధికారత దిశగా ముందడుగు రాజాపూర్‌లో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ ధ్రువపత్రాల పంపిణీ. అర్జున్ సమాచారంసెప్టెంబర్ 12, రామగిరి డెస్క్. స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశీస్సులతో, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సౌజన్యంతో అలీఫ్ సంస్థ ఆధ్వర్యంలో రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మే నెలలో ప్రారంభమైన ఈ శిక్షణలో పాల్గొన్న మహిళలకు శుక్రవారం ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజాపూర్ సర్పంచ్ పుల్లేల భాగ్యలక్ష్మి...