గురు పౌర్ణమి వేళ మంథని షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తి వెల్లువపాదదర్శనం, గురుదక్షిణ, అన్నదానం, భజనలతో ఆధ్యాత్మిక వేడుకలు

గురు పౌర్ణమి వేళ మంథని షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తి వెల్లువపాదదర్శనం, గురుదక్షిణ, అన్నదానం, భజనలతో ఆధ్యాత్మిక వేడుకలు పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 29 గురు పౌర్ణమి సందర్భంగా మంథని పట్టణంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో బుధవారం భక్తి పారవశ్యంతో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే సద్గురు షిరిడి సాయినాథుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు సాయినాథుని పవిత్ర పాదాలను దర్శించుకునే ప్రత్యేక అవకాశం...