ఎండ తీవ్రతకు ఆదివారిపేట వాసి మృతి,పెన్షన్ డబ్బుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా విషాదం.
రామగిరి, అక్టోబర్ 6 (అర్జున్ సమాచార ప్రతినిధి).
ఎండ తీవ్రతకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన రామగిరి మండలం ఆదివారము పేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారము పేటకు చెందిన కన్నూరి మైశయ్య పో సయ్య కుమారుడు పెన్షన్ డబ్బుల కోసం బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా మంథని ప్రధాన రహదారిపై లదనపూర్ సమీపంలోని ఆదివారిపేట బస్‌స్టాప్ వద్ద ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు.
స్థానికుల సమాచారం ప్రకారం మైశయ్యకు తీవ్ర అస్వస్థతకు గురై రక్తపు వాంతులు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రామగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించారు.
మృతుడు మైశయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆదివారిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.