ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 6:25 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

గీత కార్మికుల అన్ని సమస్యలు పరిష్కరించాలి.గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ.

గీత కార్మికుల అన్ని సమస్యలు పరిష్కరించాలి.
గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ.

జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచార ఆగస్టు 15:

గీత కార్మికుల అన్ని సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షుడు మేకపోతుల రమణ అన్నారు గీతన్నల చైతన్య యాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు అన్నిటినీ నెరవేర్చాలని అన్నారు ప్రభుత్వం జీవో ప్రకారం 50 ఏళ్లు పైబడిన గీత కార్మికులందరికీ 4000 పెన్షన్ ఇస్తూ ప్రమాదాలకు గురైన గీత కార్మికులందరికీ 10 లక్షల ఎక్స్రే షియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న 20 కోట్ల ఎక్స్రిగే య డబ్బులను బాధితులకు వెంటనే అందజేయాలని ఆయన కోరారు ఈనెల 18న స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు ముందుగా కవ్వాలలో స్వర్గీయ పాపన్న గౌడ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత మండల కేంద్రంలోని మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు.రాష్ట్ర ఉపాధ్యక్షులు జయ రాయమల్లు.జిల్లా అధ్యక్షుడు కాసారపు లచ్చ గౌడ్ మేకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలసాని శ్రీనివాస్ గౌడ్.మండల గౌడ సంఘం అధ్యక్షులు మూల భాస్కర్ గౌడ్.ప్రధాన కార్యదర్శి తోడేటి రవి గౌడ్ గౌడ. సంఘం జిల్లా నాయకులు కాసారు పోచ గౌడ్. రమేష్ గౌడ్ బాలా గౌడ్.పరకాల తిరుపతి గౌడ్.మహేష్ గౌడ్.తదితరులు పాల్గొన్నారు