ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 4:03 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

జేఎన్‌టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.

జేఎన్‌టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.

హైద‌రాబాద్: అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 14.

జేఎన్‌టీయూ వీసీ కిషన్‌కుమార్ రెడ్డి భార్య సుజనా రెడ్డి తనపై చేసిన ఫిర్యాదు, ఆరోప‌ణ‌లు ఆవాస్త‌మ‌ని   ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు.   గత నెల 8వ తేదీన పోలీస్ స్టేషన్‌లో తనను తిట్టినట్లు,

బెదిరించినట్లు సుజనా రెడ్డి చేసిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.  ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని వివ‌ర‌ణ ఇచ్చారు.
నేను తాను జేఎన్‌టీయూ వీసీకి ఫోన్ చేసినప్పుడు, వీసీ బాత్‌రూమ్‌లో ఉన్నారని ఎవరో ఫోన్ ఎత్తి చెప్పారని తెలిపారు. ఏదైనా విషయం ఉంటే చెప్పాలని వారు అనడంతో, తాను వీసీతోనే మాట్లాడతానని

చెప్పి ఫోన్ పెట్టేశానని వెల్లడించారు.
ఆ తర్వాత వీసీతో మాట్లాడానని, సీనియర్ ప్రొఫెసర్లను, ముఖ్యంగా మహిళా ప్రొఫెసర్లను దూషించడానికి కారణాలేమిటని ప్రశ్నించానని తెలిపారు. తనపై ఏదైనా కోపం ఉంటే తనను ప్రశ్నించవచ్చని,

అంతేకానీ మహిళా ప్రొఫెసర్లను ఎందుకు దూషించారని వీసీని అడిగినట్లు తెలిపారు. దీనికి వీసీ తప్పు జరిగిందని అంగీకరిస్తూ క్షమాపణ కోరారని, తాను తిరుపతి నుంచి తిరిగి వచ్చిన తర్వాత లేఖ ఇస్తానని

చెప్పారని పేర్కొన్నారు. మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ లేఖ రాకపోవడంతో మహిళా ప్రొఫెసర్లు పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు.
దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ జేఎన్‌టీయూ..ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థు లు ఈ సంస్థలో విద్యనభ్యసిం చి తమ జీవితాల్లో ఉన్నత స్థానాలకు

చేరుకుంటున్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు తమ కళాశాలలు కూడా అనుబంధంగా కొనసాగుతున్నాయి.
ఆ ఫిర్యాదుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు సరిగా అందించకుండా, తన భార్యతో తనపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. తక్షణమే మహిళా ప్రొఫెసర్ల పట్ల తాను వ్యవహరించిన తీరుపై వీసీ

వెంటనే క్షమాపణలు తెలియజేయాలి. వీసీ భార్య ప్రతి పనిలో జోక్యం లేకుండా యూనివర్సిటీని నడిపించేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. మహిళా ప్రొఫెసర్లతో వీసీ దురుసుగా

ప్రవర్తించారనే ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు సంబంధిత సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలించాలని అయ‌న కోరారు.