ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 7:40 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

తెలంగాణ ఆత్మకు చిరస్మరణీయ నివాళి..జయశంకర్ జయంతి సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు.

తెలంగాణ ఆత్మకు చిరస్మరణీయ నివాళి..జయశంకర్ జయంతి సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు.

అర్జున్ సమాచారం జులై 06 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:

మంచిర్యాల, ఆగస్టు 06: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పోరాటానికి ఆచార్య జయశంకర్ సార్ జీవితాంతం దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ఏర్పాటుతో ఉద్యోగులు ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ సాధనకు విశేష కృషి చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటడం ఆనందదాయకమని చెప్పారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవ కొనసాగించాలని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి, అంజయ్య, తిరుపతి, రామ్ కుమార్, నరేందర్, సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, పద్మలత, క్రీడల కార్యదర్శి కుమార్, మంచిర్యాల శాఖ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, మందమర్రి శాఖ అధ్యక్షులు సుమన్, లక్షెట్టిపేట శాఖ అధ్యక్షులు శ్రీనివాస్, బెల్లంపల్లి శాఖ అధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి క్రాంతి, ఇతర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు