ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 3:08 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సేవ పక్షంలో భాగంగా .

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సేవ పక్షంలో భాగంగా .

దండేపల్లి:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 19.

ఈరోజు రఘునాథ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దండేపల్లి మండలం నంబాల, వెల్గనూర్  ద్వారకా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మరియు జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు కలిసి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా వారం రోజుల పాటు వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా దండేపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని కంటి పరీక్షలు చేసుకోవాలని రఘునాథ్ గారు కోరారు.

ఈ కార్యక్రమంలో డేగ బాపు, గోపతి రాజయ్య, బెడద సురేష్, పత్తిపాక సంతోష్, బత్తుల శేఖర్, బండే సత్యం, మొరుపుటల సంజీవ్, గడికొప్పుల సురేందర్, ఎంబడి సురేందర్, నలిమెల మహేష్, లక్కాకుల బుచ్చన్న మరియు తదితరులు పాల్గొన్నారు