ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 1:09 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కెప్టెన్ స్మిత్ మ‌చ్చ‌ర్‌కు అశోక చ‌క్ర !

కెప్టెన్ స్మిత్ మ‌చ్చ‌ర్‌కు అశోక చ‌క్ర !

న్యూఢిల్లీ: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 2.

ఫ్లైదుబాయ్ పైలట్ స్మిత్ మ‌చ్చ‌ర్‌ను అశోక చ‌క్ర అవార్డుతో స‌త్క‌రించే ఆలోచ‌న‌లో భార‌త ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని కోపైల‌ట్ కూల్చేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. ఆ కుట్ర‌ను భ‌గ్నం చేసిన భార‌త పైల‌ట్ స్మిత్ మ‌చ్చ‌ర్‌ను అశోక చ‌క్ర అవార్డు వ‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. అత్యంత ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించే వారిని అశోక చ‌క్ర అవార్డుతో స‌న్మానించే విష‌యం తెలిసిందే. సుమారు 180 మంది ప్రాణాల‌ను కాపాడిన మ‌చ్చ‌ర్‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. భార‌త ప్ర‌ధాని మోదీ, అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌, ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్య‌హూ కూడా ఆ పైల‌ట్‌ను ఓ హీరోగా కీర్తించారు.
గుజ‌రాతీ మూలాలు ఉన్న ఆ పైల‌ట్‌కు ఇప్ప‌టికే గుజ‌రాతీ స‌ర్కారు విశిష్ట్ గుజ‌రాత్ గిరిమా అవార్డును ప్ర‌క‌టించింది. అత‌ని ధైర్య‌సాహ‌సాల‌ను మెచ్చుకున్న‌ది. సోమ‌నాథ్ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించింది. మ‌చ్చ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కాశీ విశ్వ‌నాథ్ ఆల‌యంలో కూడా పూజ‌లు చేశారు. ఒక‌వేళ మ‌చ్చ‌ర్‌కు అశోక చ‌క్ర ప్ర‌దానం చేస్తే, అప్పుడు ఆ అవార్డును గెలుచుకున్న రెండో ఏవియేష‌న్ వ్య‌క్తిగా ఆయ‌న నిలుస్తారు. 1987లో పాన్ ఆమ ఫ్ల‌యిట్ 73లో సీనియ‌ర్ ఫ్ల‌యిట్ ప‌ర్స‌ర్‌గా చేసిన నీర‌జ్ భానోత్‌కు గ‌తంలో అశోక చ‌క్ర ఇచ్చారు. హైజాక్ అయిన ఫ్ల‌యిట్‌లోని ప్ర‌యాణికుల్ని ర‌క్షించిన ఆయ‌న త‌న ప్రాణాల‌ను త్యాగం చేశారు. ప్ర‌స్తుతం మ‌చ్చ‌ర్ కూడా తెగువ చూపించిన‌ట్లు ప్ర‌శంసంలు కురుస్తున్నాయి.