ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:02 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

లక్కారం అంగన్‌వాడీ కేంద్రంలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం,చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రాధాన్యం.

లక్కారం అంగన్‌వాడీ కేంద్రంలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం,చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రాధాన్యం.

ముత్తారము:అర్జున్: సమాచారం  ప్రతినిధి ఆగస్టు 9.

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో మాతా శిశు సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన చేయడంతో పాటు అక్షరాభ్యాసం చేయించారు.

చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, బాల్యం నుంచే విద్యపై ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల సంపూర్ణ ఎదుగుదలలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, లక్కారం గ్రామ సర్పంచ్ అత్తె చంద్రమౌళి, అంగన్‌వాడీ టీచర్ రుక్మిణి, వార్డు సభ్యుడు నరేష్, ఏఎన్‌ఎం శశికళ, ఆశా కార్యకర్త కల్పన, సీఏ లలిత, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.