తెలంగాణ వార్డ్ మెంబర్ ఫోరం రాష్ట్ర స్థాయి సమావేశంలో
ముక్త సంతోష్ కుమార్ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ కు ఘన సన్మానం
అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి సెప్టెంబర్ 6
హైదరాబాద్‌లో తెలంగాణ వార్డ్ మెంబర్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫోరం అభివృద్ధి, బలోపేతం కోసం కృషి చేస్తున్న మంచిర్యాల జిల్లా ఇంచార్జి ముక్త సంతోష్ కుమార్ తెలంగాణ వార్డ్ మెంబర్ ఫోరం రాష్ట్ర బృందం ఘనంగా సన్మానించింది.
మంచిర్యాల జిల్లాలో వార్డ్ మెంబర్ల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణతో పాటు ఫోరం బలోపేతానికి ముక్త సంతోష్ కుమార్ చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో ప్రజాసేవలో కీలక పాత్ర పోషిస్తున్న వార్డ్ మెంబర్లకు సరైన గుర్తింపు, గౌరవం, హక్కులు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్ ఫోరం నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు.
మంచిర్యాల జిల్లా ఇంచార్జిగా ముక్త సంతోష్ కుమార్ మరింత బాధ్యతతో పనిచేసి, జిల్లాలోని వార్డ్ మెంబర్లందరినీ ఐక్యం చేసి ఫోరం అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర బృందం ఆకాంక్షించింది.
ముక్త సంతోష్ కుమార్ ఈ సందర్భంగా ఘనంగా సన్మానం పాటుగా అభినందించారు రాష్ట్ర నాయకత్వానికి, తెలంగాణ వార్డ్ మెంబర్ ఫోరం రాష్ట్ర బృంద సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.