ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 8:02 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించుటకై జన్నారం మండల తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన ఆటో డ్రైవర్లు

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించుటకై జన్నారం మండల తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన ఆటో డ్రైవర్లు
జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు 22:
ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కరించాలని జన్నారం ఎమ్మార్వో బక్కయ్య గారికి వినతి పత్రం అందజేశారు. ఈనెల 24న ఆటోల బందుకు సహకరించాలని కోరారు. ఆటో కార్మికుల సంక్షేమ కోసం 2వేల కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఆటోలను ఆర్టీసీ యాజమాన్యానికి అందజేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలి. ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన హామీలను అమలు చేయాలని కోరారు.ఆటో కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని జేఏసీ నాయకులు కోరారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా ఆటో కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి నహీముద్దీన్ , మండల అధ్యక్షులు తాళ్లపల్లి గంగాధర్, నసీం. వెంబడి శేఖర్. బాణావతి ప్రకాష్ నాయక్. బాదావత్ రాజ్య నాయక్. షబ్బీర్. తిరుపతి. తదితరులు పాల్గొన్నారు