ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 3:28 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మద్దికల్‌లో సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు : కలెక్టర్ కుమార్ దీపక్

మద్దికల్‌లో సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు : కలెక్టర్ కుమార్ దీపక్

భీమారం(అర్జున్ సమాచారం): జూన్ 2

భీమారం మండలం మద్దికల్ గ్రామంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే అవగాహన సద్దస్సును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, హద్దుల గుర్తింపుపై రైతులకు పూర్తి అవగాహన కల్పించేందుకే ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

మద్దికల్, మరియు ఎల్కేశ్వరం గ్రామంలోని రైతులకు రీ-సర్వే విధానాలపై ఈ సదస్సు ద్వారా రైతుల అపోహలను తొలగించి, భూ రికార్డుల పారదర్శకతకు అధికారులు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమం లో మండల తహశీల్దార్ సదానందం, మద్దికల్ సర్పంచ్ పోతం సమ్మయ్య , మహేశ్వర్ రెడ్డి, గ్రామ జి‌పిఓ లు, రైతులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.