ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 7:57 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రాజాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.చిన్నారులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిచయం.

రాజాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.చిన్నారులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిచయం.

రామగిరి: అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 9.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్, అంగన్వాడీ టీచర్ ఉగ్గె మంగ పాల్గొన్నారు. చిన్నారులకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరిస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేశారు. పండుగ పాటలు, బతుకమ్మ వేడుకలతో అంగన్వాడీ కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయా పొట్ల సుధారాణి, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.