రాజాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.చిన్నారులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిచయం.

రాజాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.చిన్నారులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిచయం. రామగిరి: అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 9. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్, అంగన్వాడీ టీచర్ ఉగ్గె...