ఆపరేటర్ లేక నిలిచిపోయిన భూభారతి సేవలు!భీమారం తహశీల్దార్ కార్యాలయంలో 20 రోజులుగా భూముల రిజిస్ట్రేషన్లు బంద్..కొనుగోలుదారులు, విక్రయదారుల అవస్థలు.
ఆపరేటర్ లేక నిలిచిపోయిన భూభారతి సేవలు!భీమారం తహశీల్దార్ కార్యాలయంలో 20 రోజులుగా భూముల రిజిస్ట్రేషన్లు బంద్..కొనుగోలుదారులు, విక్రయదారుల అవస్థలు. భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 19: భీమారం మండల తహశీల్దార్ కార్యాలయంలో భూభారతి ఆపరేటర్ లేకపోవడంతో గత 20 రోజులుగా భూముల కొనుగోలు, అమ్మకాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. భూభారతి ఆపరేటర్ అందుబాటులో లేకపోవడంతో స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్లు పూర్తికాకపోవడంతో భూముల కొనుగోలుదారులు, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో పనిచేసిన కాంట్రాక్ట్ ఆపరేటర్లను తొలగించి, జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి...