ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 1:28 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

టీఎన్జీవో భవన్ మంచిర్యాలలో ఘనంగా నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

టీఎన్జీవో భవన్ మంచిర్యాలలో ఘనంగా నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు.

మంచిర్యాల:అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 2.

జాతిపిత మహాత్మా గాంధీ , లాల్ బహదూర్ శాస్త్రి గారీ ,జయంతిని పురస్కరించుకొని టీఎన్జీవో భవన్ మంచిర్యాలలో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగినది. ఈ సందర్భంగా టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో జాతిపిత మహాత్మా గాంధీ ,లాల్ బహుదూర్ శాస్త్రి గారి సేవలు వెలకట్టలేనివని, వారు చూపిన మార్గంలో అందరు నడవాలని తెలపడం జరిగినది. ఈ జయంతి కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్ కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నమల్లయ్య అసోసియేట్ అద్యక్షులు శ్రీపతి బాపురావు ఉపాధ్యక్షులు తిరుపతి బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ మంచిర్యాల యూనియన్ ఉపాధ్యక్షులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు..